మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న అడవి శేష్…

Share Icons:

హైదరాబాద్, 3 జూన్:

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరైనా హీరో అడివి శేష్ మరో వైవిధ్యభరితమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల క్షణం’ .. ‘గూఢచారి’ సినిమాలతో మెప్పించిన ఆయన…. తాజా చిత్రంగా సెట్స్ పై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వుంది. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ‘ఎవరు?’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

వెంకట్ రామ్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి అబ్బూరి రవి సంభాషణలను సమకూర్చారు. ఆగస్టు 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అడివి శేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతోనే మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా చిత్రీకరణను కానిచ్చేస్తున్నామని ఆయన అన్నాడు.

Leave a Reply