వివాదాల్లో బిగ్ బాస్….షోపై నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు….

actress gayatri gupta complaint on big boss
Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ షో వివాదాల్లో మునిగి తెలుతోంది. ఇప్పటికే షో నిర్వాహకులపై మాజీ యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 3 షోలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బంజారా హిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3 ద్వారా ఉత్తరాది సంస్కృతిని తెలుగువారిపై రుద్దుతున్నారని ఆమె ఆరోపించారు. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ జరుగుతోందంటూ శ్వేతారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

బిగ్ బాస్ 3 అడిషన్స్‌లో సెలక్ట్ అయిన తనను ఓ నిర్మాత ‘బిగ్ బాస్‌ను కన్విన్స్ చేస్తే.. షోలోకి ఎంట్రీ ఇస్తాం’ అంటూ మాట్లాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న తరుణంలోనే నటి గాయత్రి గుప్తా కూడా బిగ్ బాస్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

 

బిగ్‌బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని, దీంతో ఆరు సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని తెలిపింది. తీరా, ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పారని ఆరోపించింది. బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడని, వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని అన్నారని గాయత్రి గుప్తా తెలిపింది. తాను సరేననడంతో వేరే ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని పేర్కొంది. అభిషేక్, రఘు, రవికాంత్‌లు తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారని వివరించింది.

 

ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది. ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక దీని వల్ల తన చేతిలో ఉన్న ఆరు సినిమాలు వదిలేసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ మేరకు బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఆమె కేసు వేశారు.

Leave a Reply