చంద్రబాబునే ఎన్‌కౌంటర్ చేస్తే సరిపోతుందిగా….

Share Icons:

విజయవాడ, 6 అక్టోబర్:

బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్రమోదీలపై నటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మోదీ టార్గెట్ చంద్రబాబు కాబట్టి ప్రజలను హింసించే బదులు అదేదో ఆయననే ఎన్‌కౌంటర్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అన్నారు.

శుక్రవారం రాత్రి విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మొన్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపైన, ఇప్పుడు ఏపీలో ఐటీ దాడుల వెనక కేంద్రానికి ప్రత్యేక లక్ష్యం ఉందని ఆరోపించారు.
ఇక నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ఈ మొత్తం దాడుల వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, అతడే సమాచారాన్ని ఐటీ అధికారులకు అందిస్తున్నాడని అన్నారు.

అసలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్ కుంభకోణం నుంచి ప్రజల దారి మళ్లించడానికే కేంద్రం ఐటీ దాడులతో బెంబేలెత్తిస్తోందని, తాను ర్యాలీ నిర్వహించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తానని చెప్పారు. ఏపీ ప్రజల మంచితనం వల్లే జీవీఎల్ ఇక్కడ తిరగగలుగుతున్నారని, అదే తెలంగాణలో అయితే కాలు కూడా పెట్టేవారు కాదని అన్నారు.
టీటీడీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతున్న సుబ్రహ్మణ్యస్వామి ఓ సన్నాసని, తిరుమల జోలికి ఎవరొచ్చినా నరికేస్తానని హెచ్చరించారు. చెప్పుడు మాటలు విని పవన్ కల్యాణ్ హోదా గురించి మర్చిపోయారని శివాజీ అన్నారు.

మామాట: మీరు బీజేపీని గట్టిగానే టార్గెట్ చేసినట్లున్నారు…

Leave a Reply