తేలని ఆలీ సీటు వ్యవహారం

Share Icons:

హైదరాబాద్, మార్చి 18,

అదేదో నగల కొట్టు ప్రకటనలో ఓ గుండాయన నాలుగు షాపులు తిరుగు, నచ్చినవి ఫోటో తీసుకో, మాదగ్గరే కొనుక్కో అంటారు కదా. అట్లా పాపం మన కెమెడియన్ ఆలీ కూడా సీరియస్ గానే జనవరి నుంచి జనసేన, టీడీపీ, వైసీపీ అంటూ అన్ని పార్టీల అథినేతలను కలుస్తూ వచ్చారు. దీనితో ఆలీ ఫలానా పార్టీలో చేరారనే వార్తలు మీడియాలోను హడావుడి చేసేవి.

ఇది ఇలా ఉండగా ఓ శుభోదయాన ఆలీ సద్దులేకుండా వెళ్లి జగన్ ను కలిసారు. వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్  సీఎం కావడమే నా లక్ష్యం అన్నారు. అందరూ ఫ్రెండ్స్ కదా కలిశాను, కానీ పవన్ ముఖ్యమంత్రి అయితే నేనే మొదట సంతోషిస్తా అంటూ వైయస్ జగన్ నివాసంలో ఉండగానే నోరు జారారు. ఇంకే ముంది… కొంప మునిగింది. నిన్న వెలువడ్డ వైసీపీ ఎంఎల్యే జాబితాలో ఆలీ పేరు కనిపించడం లేదని ఆయన అభిమానులు తెగ బాధపడుతున్నారు.

ఇప్పటికే వైసీపీ అన్ని ఎంపీ, ఎంఎల్యే సీట్లుకూ అభ్యర్థులను ప్రకటించడంతో ఆలీ గోడ దూకి టీడీపీలో అదృష్టం పరీక్షించుకుంటారా… లేకా మరో ఐదేళ్లు కామెడీ షోలు చేసుకుంటూ మరో ఛాన్స్ కోసం వేచి చూస్తారా అని అవేదన చెందుతున్నారు.

మామాట:  ఆలీని పెట్టి కామిడీ గీమిడీ చేయట్లేదు కదా.. ఆఁ….

Leave a Reply