మా గురించి

సమీచీన సమీకరణాల సమగ్ర సమాచార వేదిక “మామాట అంతర్జాల వార్తా సమాహారం”. ఎన్నో అంతర్జాల వార్తా సంచికలు, వేటి విభిన్నత వాటిది, అయితే అనుకరణలకు, మూస పోకడలకు భిన్నంగా దైనందిన సమాచారంతో పాటు సాహితీ ప్రియులకు చేత వెన్నముద్దలు, రసాభిలాషులకు చెంగల్వ పూదండలు, అక్షరరూపంలో మీకందించి అలరిస్తుంది మామాట.

స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు విశేషాలతో పాటు, సమకాలీన రాజకీయాలు, సామాజిక సంబంధమైన విషయాలు, ముఖ్యసంఘటనల గురించి విశ్లేషణాత్మక సంపాదకీయాలను అందించడంలో మామాట ముందుంటుంది. సమకాలీన సమస్యలు, వివాదాలకు సంబంధించి తెరమరుగైన సంఘటనలను కూడా వెలికి తీసి వాటి యదార్థ పరిస్థితిని వాస్తవాలతో సహా మీ ముందుంచుతుంది. రాజకీయ పార్టీలకు, సామాజికవర్గాలకూ, కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, మామాట స్వతంత్ర పంథాలో వ్యవహరించి, ప్రజాస్వామ్యానికి నిజమైన మూల స్తంభంగా నిలుస్తుంది. ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేసే ఉత్తమ ప్రభుత్వాధికారుల సేవలకు పెద్దపీట వెయ్యడం మామాట ప్రత్యేకత.

రాజకీయ, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలపై పట్టు కలిగిన, నిష్ణాతులైన మేధావులు, సుప్రసిద్ధ రచయితలు తమ కలాయుధాలతో, మామాట చేస్తున్న అక్షర పోరాటంలో బాసటగా నిలుస్తున్నారు.

ప్రజలకు బాసటగా నిలుస్తూ వారి సమస్యల విషయంలో ఏ రాజకీయ పార్టీనైనా నిలదీసి ప్రశ్నించడానికి గాని, నిష్కర్షగా విమర్శించడానికి గాని మామాట వెనుకాడదు. జనసామాన్యానికి వెన్నుదన్నుగా నిలిచి రాజ్యాంగ స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు నిరంతరం అక్షర పోరాటం చేస్తుంది మామాట.

అక్షరం శీర్షికన వివిధ అంశాలపైన, సాహిత్యంపైన వ్యాసాలను అంతర్జాల వీక్షకులకు, సాహిత్యాభిమానులకు పసందుగా అందిస్తుంది మామాట. చక్కని రచనా నైపుణ్యం, అపార భావసంపద, సాహిత్యం పట్ల జిజ్ఞాస కలిగిన ఔత్సాహికులైన యువతీయువకులకు అక్కున చేర్చుకోవడానికి మామాటలో అక్షరం శీర్షిక సర్వవేళలా సిద్ధంగా ఉంటుంది.

ఆవరణం శీర్షికన గృహావరణం పేరుతో ఇల్లు, ఇంటి వాతావరణం, పరిసరాలకు సంబంధించిన అంశాలపై చక్కటి వ్యాసాలను, పర్యావరణం పేరుతో ప్రకృతికి సంబంధించిన అన్ని అంశాలనూ స్పృశిస్తూ ఆసక్తికరమైన విషయాలను, అంతరావరణం పేరుతో మానసిక ఆరోగ్యం, పరివర్తన, పరిణామము, ఆధ్యాత్మికతను గురించిన అంశాలను గూర్చి శాస్త్రీయ విషయాలను అందిస్తుంది మామాట.

జనబాహుళ్యానికి అవసరమైన అత్యంత విలువైన ఆరోగ్య సూత్రాలను, వివిధ ఆధునిక వైద్య శాస్త్ర విధానాలను, ప్రత్యేక చికిత్సలను గూర్చిన అంశాలను, విశ్వవిఖ్యాతిగాంచిన ఆయుర్వేద రహస్య విశేషాలను ఆసక్తికరమైన వ్యాసాల రూపంలో మామాట మీ ముందుంచుతుంది.

సినిమా, టీవీ, అంతర్జాల మాధ్యమాలు ఇంకా క్రీడలు, సాంస్కృతిక, వినోదరంగాల తాజా వార్తలను మామాట అప్పటికప్పుడు అందజేస్తూ చదువరులను రంజింపజేస్తుంది. అంతే కాక హాస్య, చమత్కార, వ్యంగ్య చిత్ర వైభవాలను మామాట సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది.

విద్యార్థులు, విద్యావంతులైన యువకులకు ప్రయోజనం కలిగించే విధంగా సమకాలీనంలో అందుబాటులో ఉన్న వివిధ వృత్తి విద్యా కోర్సులను, ఉపాధి మార్గాలను తెలియజేయడమే కాక ఆ రంగాలలో నైపుణ్యాలను సాధించే విధానాలను కూడా విశ్లేషణాత్మక కథనాల ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యవసాయం, వ్యవసాయానుబంధాలు, పల్లె-పనిముట్లు మరియు పెరటి తోటలు శీర్షికల కింద సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, వివిధ రకాలైన పంటలు, విధానాలు, పండ్ల తోటలు, అంతర్జాతీయంగా వ్యవసాయానికి సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, సేంద్రీయ ఎరువులు మొదలైనవాటిగురించిన సమాచారాన్ని అందరికీ చేరవేస్తుంది మామాట.

వాణిజ్యం శీర్షికన ఆయా రంగాలకు సంబంధించిన తాజా వార్తలు విశేషాలతో పాటు, పరిశ్రమలకు, సమాచార సాంకేతిక విజ్ఞాన రంగంలోజరిగే సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల గురించి సమాచారం అందించడంలో ఎప్పుడూ మామాట ముందుంటుంది. ఛాయాచిత్రాలు, దృశ్యరూప కథనాలు మామాటలో ప్రత్యేక ప్రాధాన్యతతో చదువరులను ఆకట్టుకుంటాయి.