టీడీపీలో అంతర్గత కలహం…ఏబీ వ్యవహారంపై రచ్చ…

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి: ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ కావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఏపీలో నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని, దేశ రహస్యాలను ఇజ్రాయెల్ కు చెందిన ప్రైవేటు సంస్ధల చేతికి అందించారని ఏబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం విచారణ కూడా చేయిస్తుంది. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే ఏబీ ఇష్యూ టీడీపీలో చిచ్చు రేపింది.

ఏబీ వెంకటేశ్వరరావుపై విజయవాడ ఎంపీ కేశినేని పెట్టిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వైసీపీకి ఉపయోగపడ్డ ఆయనకు సన్మానం చేస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటని కేశినేని తన ట్వీట్ లో ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైసీపీకే కాదు టీడీపీ నేతలకు కూడా అర్ధం కాలేదు. కానీ ఆరా తీస్తే దీని వెనుక అసలు వాస్తవం వేరే ఉందని తెలుస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇంటిలెజన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏడీజీ స్ధాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు టీడీపీతో విడతీయరాని అనుబంధం ఉంది.

చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న వెంకటేశ్వరరావును అఫ్పటి ప్రభుత్వం కీలకమైన ఇంటిలిజెన్స్ ఛీఫ్ బాధ్యతలు కట్టబెట్టింది. అయితే చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యం ప్రతిపక్ష వైసీపీకే కాదు టీడీపీలోని పలువురు సీనియర్లకూ కంటగింపుగా మారింది. వెంకటేశ్వరరావుకు అమిత ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. తమను పక్కనబెట్టడంపై టీడీపీలోని కేశినేని నాటి వంటి సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. అయితే సీఎంగా ఉన్న చంద్రబాబును కాదని వెంకటేశ్వరరావును విమర్శించలేని పరిస్ధితి.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా రాష్ట్రంలో వాస్తవ పరిస్ధితులను చెప్పాల్సింది పోయి టీడీపీ పరిస్ధితి అన్నిచోట్లా బావుందని తప్పుడు నివేదికలు ఇచ్చారన టీడీపీ సీనియర్లు అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అటు తమ పార్టీ నేతలపై నిఘా పెట్టడంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించారంటూ వైసీపీ నేతలు కూడా ఏబీవీపై గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై కేశినేని నాని ట్వీట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధికార ప్రతినిది పట్టాభి… ఈ విషయంలో ఆయనతో తీవ్రంగా విభేదించారు. కేశినేని వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని పట్టాభి వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు మండిపడ్డారు.

 

Leave a Reply