ఆ పొడి తింటే.. ఇక పడకగదిలో రెచ్చిపోవచ్చు.

ఆ పొడి తింటే.. ఇక పడకగదిలో రెచ్చిపోవచ్చు.
Views:
181

తిరుపతి, మార్చి13 :

పెళ్ళి కాక ముందు ఉన్న హుషారు. పెళ్ళయిన రాత్రే చాలా మందికి తుస్సుమంటుంది. రోగం తగిలిన కోడిలా మెడ వాల్చేస్తారు. శోభనం గదిలో ఢీలా పడిపోతారు. కారణం శృంగారం పట్ల కనీస అవగాహన లేక, లైంగికంగా ఎలా పాల్గొనాలన్న విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. మరికొందరిలో ఇలాంటి వాటితో సంబంధం లేకుండా లైంగిక సామర్థ్యం లేకుండా వుంటారు. ఈ అంశాలను ఎవరితో పంచుకోలేరు. నిజంగా వారిలో సామర్థ్యం లేక కాదు. అలాంటివారికి మానసిక సంసిద్ధత అవసరం. లైంగిక చర్యకు దిగేటప్పడు మానసికోల్లాసం అవసరం. అయితే భయం వెంటాడుతుంటే వారు గాలి తీసి తిత్తిలా ముడుచుకుపోతారు. ఇలాంటి సందర్భాలలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. వీటిని అధిగమించి హాయిగా గడపాలంటే, కొన్ని మార్గాలున్నాయి.

sexual harrasement case on south indian governorశృంగారం అనగానే అదేదో చీకటి గదిలో జరిగే ఓ క్రీడ అనుకుంటారు చాలా మంది. కాదు. భార్యభర్తల మధ్యన చాలా అవగాహన అవసరం. శృంగారానికి ముందు ప్రేరేణ అవసరం. ప్రేరణలో భాగంగా శృంగారంలో పాల్గొనేందుకు మానసికంగా ఇద్దరూ సిద్ధమవ్వాలి. అన్యోన్యత అవసరం. అయితే వీటికి తోడుగా ప్రకృతి మనకు దివ్యమైన ఔషధాలు ఎన్నో ఇచ్చింది. వాటిలో అతి శ్రేష్టమైనవి పెద్దదోలగొండి గింజలు. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అమోఘంగా పని చేస్తాయి. ఎక్కడలేని ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. బెరుకును, బిడియాన్ని దూరం చేస్తాయి. ఇవి ఆయుర్వేదం షాపులలో దొరుకుతాయి. ఇవి తెలుపు, నలుపు రంగులలో వుంటాయి. వీటిలో ఏరకమైనవైనా వాడుకోవచ్చు.

వీటిని ఎలా తీసుకోవాలి అనేగా మీ అనుమానం. పెద్ద దోలగొండి గింజలను ముందుగా కాస్త వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. దానితోపాటు పటికబెల్లం కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ గింజల పొడి 3 గ్రాములు, పటిక బెల్లం పొడి 3 గ్రాములు తీసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని రాత్రి భోజనం చేసిన గంట తర్వాత పడుకునే ముందు స్వచ్ఛమైన గ్లాసుడు ఆవుపాలు కాని, గేదెపాలు కాని గోరువెచ్చగా కాచి వాటిలో ఈ పొడిని కలుపుకొని తాగాలి.

సాధారణంగా పాలే మనిషిలో ప్రేరణను కలుగజేస్తాయి. వాటితోడు ఈ పొడి కలిస్తే శరీరంలోని లైగింక అవయవాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దానికి తోడు ప్రశాంతత లభిస్తుంది. ఇక పడకగదిలో సంపూర్ణ సంభోగ తృప్తి లభిస్తుంది. ఇలా సుమారు 20 రోజుల పాటు తీసుకోవటం వల్ల మగవారిలో సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందని ఆయుర్వేదం చెపుతోంది.

మామాట : భారతీయ ఆయుర్వేదాన్ని రంగరిస్తే దివ్య ఔషదాలే వస్తాయి.

English Summary :

Sex is not routin process. It is understanding and affecnate memorable excesize between couple. It should be a pleasent environment, and fresh mind.

(Visited 98 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: