అదిరిపోయే ట్విస్ట్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’

Share Icons:

హైదరాబాద్, 16 ఫిబ్రవరి:

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, మహేశ్ హీరోగా 2006లో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెల్సిందే. ఆ సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు. లాస్ట్‌లో మహేశ్ పోలీస్ అనే తెలిసే ట్విస్ట్ ఎవరు ఊహించారు. ఇక ట్విస్టే సినిమాకి ఒక రేంజ్ విజయం వచ్చేలా చేసింది.

ఇప్పుడు అదే తరహా ట్విస్ట్‌తో పూరి… రామ్ హీరోగా నటిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాని రూపొందిస్తున్నారట. ఇప్పటికే పక్కా  ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది.   ఈ సినిమా క్లైమాక్స్ ‘పోకిరి’ తరహాలో ఒక రేంజ్ లో వుండేలా పూరి డిజైన్ చేశాడని అంటున్నారు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ లోనే కావలసినంత కామెడీ వుండేలా చూసుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆయనకి హిట్ పడటం ఖాయమనే టాక్ కూడా ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి రామ్, పూరి కలిసి ఏ రేంజ్ హిట్ కొడతారో…

మామాట: పూరి సినిమాల్లో ఇలాంటి ట్విస్టులు మామూలేగా

Leave a Reply