మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటున్న పుతిన్..

Share Icons:

మాస్కో, 21 డిసెంబర్:

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మ‌ళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటార‌న్న విష‌యాన్ని మాత్రం ఈ 66 ఏళ్ల అధ్యక్షుడు వెల్ల‌డించ‌లేదు.

ఓ గౌర‌వ‌ప్ర‌ద‌మైన వ్య‌క్తిగా, ఏదో ఒక రోజు పెళ్లి చేసుకునే అవ‌కాశం ఉంద‌ని గురువారం మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ అన్నారు. అయితే పుతిన్ 1983లో లుద్‌మిలా పుతినాను పెళ్లి చేసుకున్నారు. ఇక ఆమెకు పుతిన్ 2013లో విడాకులు ఇచ్చారు.

ఇక ఈ ఇద్దరి జంట‌కు క‌త్రినా, మారియా కూతుళ్లు ఉన్నారు. అయితే వీరిద్దరూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అలినా క‌బేవాతో పుతిన్ డేటింగ్ చేస్తున్న‌ట్లు ఓ ర‌ష్యా ప‌త్రిక వెల్ల‌డించింది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మామాట: మొత్తానికి రష్యా అధ్యక్షుడు మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యారు...

Leave a Reply