లైంగిక దాడికి గురైన చిన్నారికి…అరగుండు…బహిస్కరణ…!!

లైంగిక దాడికి గురైన చిన్నారికి…అరగుండు…బహిస్కరణ…!!
Views:
18

రాయపూర్‌, 13 ఫిబ్రవరి:

లైంగిక వేధింపుల‌కు గురైన ప‌ద‌మూడేళ్ల బాలికకు శుద్ధీక‌ర‌ణ పేరుతో పంచాయ‌తీ పెద్దలు అర‌గుండు చేయించిన ఘ‌ట‌న ఛత్తీస్‌గ‌ఢ్‌లోని కవర్ధాలో చోటు చేసుకుంది.

కేంద్ర పథకం కింద నిర్మిస్తున్న గృహాల పనికి జనవరిలో ఈ బాలిక తల్లితో కలిసి వెళ్లింది.

ఆ సమయంలో అర్జున్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారి కులానికి చెందిన వారు ఆ వ్యక్తిని పిలిచి జరిమానా విధించి వదిలేశారు.

తరువాత ఫిబ్రవరి 4న బాధితురాలి కుటుంబాన్ని పిలిచి, ప్రక్షాళన పేరుతో గ్రామ పెద్దలు ఆపాపకు అరగుండు చేయించారు. అలాగే ఆహారంలో మాంసం, పానీయాలు తీసుకోకూడదని తల్లిదండ్రులకు ఆజ్ఞలు జారీ చేశారు.

అంతేగాక, ఆ బాలికతో ఎవ్వరూ మాట్లాడవద్దని, ఆమె గ్రామ ప్రజలకు దూరంగా ఉండాలని బహిష్కరించారు.

మీడియా సమాచారంతో పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళగా, మొదట్లో నిజం చెప్పడానికి ఆ చిన్నారి భయపడింది.

కానీ, పోలీసులు ధైర్యం చెప్పడంతో ఆ చిన్నారి తర్వాత జరిగిందంతా తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అర్జున్ యాదవ్‌ను అరెస్టు చేశారు.

ఆ బాలికను బహిష్కరించిన పంచాయతీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మామాట: పంచాయతీ సభ్యులను కూడా ఇలానే చేస్తే సరీ…

English Summary: A minor girl was  was half shaved over alleged incident of eve teasing in Kawardha. The decision was given by the panchayat of her own tribe. Case registered under the Atrocity act. The culprit Arjun Yadav has been detained.

(Visited 8 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: