దారుణం: సొంత చెల్లినే తల్లిని చేసి….

Share Icons:

హైదరాబాద్: మానవ సంబంధాలు రోజురోజుకూ దెబ్బ థింతున్నాయనడానికి మరో ఉదాహరణ దొరికింది. రక్తం పంచుకుని పుట్టిన చెల్లిపైనే ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడికట్టాడు. చెల్లిపై రోజు అఘాయిత్యం చేసి..ఆమెని తల్లి కూడా చేశాడు. ఇక అమాయకపు చెల్లి ప్రసవించాక, శిశువుని చెత్త కుప్పలో పడేసి చేతులు దులుపుకున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి…నిందితుడుని కటకటాలు వెనుకకు పంపారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఉమ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో చెత్తకుప్ప వద్ద ఈ నెల 15న ఓ శిశువు ఏడుపు వినిపించింది. స్థానికంగా ఉండే ప్రతిభా బోర్స్ అనే మహిళ అక్కడికి వెళ్లి చూడగా రోజుల వయసున్న పసిబిడ్డ కనిపించింది. దీంతో ఆ పసిబిడ్డని ఇంటికి తీసుకొచ్చి…స్నానం చేయించి, పాలు తాగించి, చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసులకు విషయం చేరవేశారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును సంరక్షణా కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దర్యాప్తు సందర్భంగా పోలీసులకు ఓ విషయం తెలిసింది. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఆమె దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అడిగి తెలుసుకున్నారు. అమాయకురాలైన బాలికను సొంత అన్నే బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతడి కారణంగానే ఆమె గర్భం దాల్చినట్లు చెప్పింది.

ఇక ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో తన గుట్టు బయటపడుతుందన్న ఆందోళనతోనే ప్రసవం కాగానే శిశువును ఎత్తుకెళ్లి చెత్తకుప్పలో పడేసినట్లు తేలింది.

ఇక విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ నుంచి తేరుకొని ఇంతటి నీచానికి పాల్పడిన ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Leave a Reply