నేపాల్ విమానప్రమాదానికి కారణం ఏంటి? సమాచారలోపమేనా?

నేపాల్ విమానప్రమాదానికి కారణం ఏంటి? సమాచారలోపమేనా?
Views:
9

కఠ్మాండూ మార్చి 13 :

కఠ్మాండూలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిచింది. కొందరు ప్రత్యక్ష సాక్షులు, ఏటీసీ సంభాషణలను బట్టి చూస్తే పైలట్‌కు, ఏటీసీకి మధ్యన పలుమార్లు గందగోళ సంభాణ కారణంగానే విమానం కుప్పకూలి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

నేపాల్ రాజధాని కఠ్మాండులో జరిగిన విమాన ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. 71 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన యూఎస్‌-బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నేపాల్‌ రాజధాని కఠ్మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి అనుమతి కోరింది.

ఉత్తరం వైపు ల్యాండింగ్‌ కోసం పైలట్‌ తొలుత అనుమతి కోరగా ఏటీసీ అంగీకరించింది. నిమిషం తేడాతోనే మళ్లీ పైలట్‌ తాను దక్షిణంపైపు దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దక్షిణం వైపు ల్యాండింగ్‌కు క్లియర్‌ చేస్తున్నట్లు ఏటీసీ చెప్పినట్లు రికార్డులు తెలిపాయని ఓ వెబ్ సైట్ వెల్లగించింది. ఇంతలో దక్షిణం వైపు ల్యాండ్ అవ్వాల్సిన విమానం తిరిగి ఉత్తరం వైపు వచ్చిందని అధికారులు చెప్తున్నారు.

చివరలో ట్రాఫిక్‌ కంట్రోలర్‌ భయంతో మాట్లాడినట్లు అనిపించిందని, పైలట్‌తో ‘ఐ సే అగైన్‌, టర్న్‌’ అని అన్నారని, ఆ తర్వాత వెంటనే కంట్రోలర్‌ అగ్నిమాపక సిబ్బందిని రన్‌వే పైకి వెళ్లమని ఆదేశించిందని చెప్పారు.

ఇదిలా ఉండగా విమానం దిగడానికి ముందు పలుమార్లు దిశ మార్చుకునే ప్రయత్నం చేసిందని మరో వ్యక్తి తెలిపారు. వీటన్నింటికి ఏటీసీ నుంచి అందిన ఆదేశాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ సూచనలు సరిగ్గా పాటించలేదని, విమానం తప్పుడు దిశలో రన్‌వే పైకి వచ్చిందని కఠ్మాండు విమానాశ్రయం జనరల్‌ మేనేజర్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా, అధికారులు విమానం శకలాల నుంచి బ్లాక్‌బాక్స్‌ను సేకరించారు. ఈ ఘటనపై నేపాల్‌ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఇందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలను నిపుణులు ప్రభుత్వానికి అందజేయనున్నారు.

మామాట : మొత్తంపై ఏటీసీ, పైలట్‌కు మధ్య సమాచార లోపం కనిపిస్తోంది.

English Summary :

Nepal Government constituted a team constituted for enquiry on plane crashin Kathmandu on Tuesday, A plane crashed from Bangladesh to Kathmandu on Monday. In this incident 50 passangers died. As per sources mis communication happend between ATC and Pilot.

(Visited 5 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: