భార్యను పరీక్షా కేంద్రంలోకి పంపి….! కుప్పకూలాడు…!!

Share Icons:

చిత్తూరు, జూన్ 13 :

భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాయించేందుకు వచ్చిన ఆమెను లోనికి పంపి గంట తిరగక మునుపే భర్త హఠత్మరణం పొందారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన భార్య లబోదిబోమంటూ గుండెలు బాదుకుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.

జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లె పంచాయతీ కొండేపల్లెకి చెందిన ప్రభాకర్‌(33), సరితలు భార్యభర్తలు. వృత్తి రిత్యా మెకానిక్ అయిన ప్రభాకర్ తన భార్యను చదువులో ప్రోత్సహించాడు. సరితకు టెట్ పరీక్ష ఉండడంతో ఆమెను తీసుకుని మంగళవారం తెల్లవారుజామున బయలుదేరి తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్దనున్న పరీక్ష కేంద్రం ఉన్న అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలకు వచ్చారు. టెట్‌ పేపర్‌–1 పరీక్ష రాసేందుకు ఉదయం 8.30 గంటలకు భార్య సరితను కేంద్రంలోకి పంపి ఆమె కోసం కళాశాల ప్రాంగణంలో ప్రభాకర్‌ కూర్చుని నిరీక్షించాడు.

అయితే 10 గంటల సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. తాళలేకపోయాడు. పక్కనున్న వారంతా తేరుకుని దగ్గరికి చేరేలోపే తుదిశ్వాస విడిచాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన సరిత భర్త మృతి చెందడాన్ని చూసి తీవ్ర మనోవ్యధకు గురైంది. మృతుడికి ముగ్గురు పిల్లలు యశ్వంత్‌(9), హాసిని(7), గోపీకృష్ణ(5) ఉన్నారు.

మామాట : భార్య పరీక్ష రాసే లోపే…

Leave a Reply