బరి తెగించిన జంట, ముంబయి డివైడర్ పైనే…. ఏం చేశారు..?

Share Icons:

ముంబయి, జూన్ 11 :

ఆ జంట బరితెగించింది…. తాము సభ్య సమాజంలో ఉన్నామనే మాటే మరిచిపోయారు. ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో నడిరోడ్డులో డివైడర్‌పై కూర్చుని ఏం చేయకూడదో అదే చేసేశారు. ఇంతకీ ఆ జంట నడిరోడ్డుపై ఏం చేసింది. కొంప తీసి ఆ…పని కాదు, కదా… తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే….

ముంబై మహానగరంలో మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డు నిత్యం అత్యంత రద్దీగా ఉండే రోడ్డు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వాహనాలలో జనం వెళ్ళుతూనే ఉంటారు. పక్కనే అరేబియా సముద్రం ఉంటే, రోడ్లపై జన ప్రవాహం కదులుతుంటుంది. మరోవైపు రోడ్డుకు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌‌లు, వాటి పక్కనే ఉండే పిట్టగోడపై కూర్చుని చాలామంది అరేబియా సముద్రపు గాలిని ఆస్వాదిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఏం జరిగిందో తెలుసా…?

ఓ జంట కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఉన్నట్లుండి డివైడర్ పై కూర్చున్నారు. తాము ఎక్కడున్నామనే కనీస ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయారు. సరిగ్గా నరిమన్ పాయింట్ వద్ద రోడ్డు డివైడర్‌పై కూర్చొని కొవ్వెక్కిన ఆ… కార్యక్రమం మొదలెట్టేశారు. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. తమ కేళీలో తేలియాడిపోయారు.

విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడకు రావడంతో దుస్తులు సరిచేసుకుని ఆ జంట అక్కడి నుంచి ఉడాయించింది. అయితే, పోలీస్ పెట్రోలింగ్ వాహనం వారిని వెంబడించగా, యువతిని మాత్రం పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు. అతడు విదేశీయుడని తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మామాట : శృంగారం చాటుమాటు వ్యవహారమేనంటారా?

Leave a Reply