కవలలే కానీ…సంవత్సరం తేడా…

Share Icons:

కాలిఫోర్నియా, 5 జనవరి:

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మ‌రియా ఎస్ప‌రెంజాకు క‌వ‌ల‌ పిల్లలు పుట్టారు.

కానీ అందులో ఒకరు 2017 సంవత్సరంలో, మరొకరు 2018 సంవత్సరంలో పుట్టారు. అదేంటి వేర్వేరు సంవత్సరాల్లో ఎలా పుట్టారు అనుకుంటున్నారా..

అయితే ఆ కవల పిల్లల కథ తెలుసుకుందాం రండీ..

కాలిఫోర్నియాకు చెందిన మ‌రియా ఎస్ప‌రెంజాకు ఇద్ద‌రు క‌వ‌ల‌లకి జన్మనిచ్చింది.

అయితే అందులో మొదటిగా బాబు డిసెంబ‌ర్ 31, 2017 అర్థ‌రాత్రి 11:58 గంట‌ల‌కు జ‌న్మించ‌గా, జ‌న‌వ‌రి 1, 2018న 00:16 గంట‌ల‌కు పాప జ‌న్మించింది.

వీళ్ళిద్దరు కేవ‌లం 18 నిమిషాల తేడాతో జ‌న్మించారు.

కానీ వారి పుట్టిన‌తేదీల మ‌ధ్య ఏడాది తేడా రావడానికి కార‌ణం కొత్త సంవ‌త్స‌రం. ఆ విధంగా వారు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు.

అసలు నిజానికి ఎస్ప‌రెంజాకు ప్రసవ సమయం జ‌న‌వ‌రి 27న ఇచ్చారు. అయితే డిసెంబ‌ర్ 31నే పురిటి నొప్పులు రావ‌డంతో డెలానో రీజిన‌ల్ మెడిక‌ల్ సెంట‌ర్‌కి తీసుకువ‌చ్చార‌ట‌. అక్క‌డి డాక్ట‌ర్లు ఆమెకు డెలివ‌రీ చేశార‌ట‌.

ఇలాంటి అరుదైన సంఘటన చూడలేదని అక్కడి డాక్టర్లు అంటున్నారు.

ఇంకా అదేవిధంగా ఆసుప‌త్రి సంప్ర‌దాయంలో భాగంగా కొత్త సంవ‌త్స‌రంలో జ‌న్మించిన మొద‌టి శిశువుల‌కు 3000 డాల‌ర్లు బ‌హుమ‌తిగా ఇచ్చినట్లు వారు తెలిపారు. ఇక ఈ కవల పిల్లలకి జోయాక్విన్ జూనియ‌ర్ ఓంటివెరోస్‌, ఐతానా దె జీస‌స్ ఓంటివెరోస్ అని పేర్లు పెట్టారు.

మామాట: ఒకే కాన్పులో పుట్టిన పిల్లలే అయినా, తేడా మాత్రం యేడాది. 

English summary: A American lady delivers twins in two different years. First baby boy was born on 31st December 2017 and second baby girl was born on 1st January 2018.

Leave a Reply