1500 కోట్లతో త్రీడీలో తెరకెక్కనున్న రామాయణం…

A 3-Part Ramayana With 500 Crore Budget Announced. No Casting Details Yet
Share Icons:

హైదరాబాద్:

 

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ మరో భారీ సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యారు. మ‌హాకావ్యం రామాయణాన్ని త్రీడీలో తెరకెక్కించడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా అనే మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణం సినిమాను 3డిలో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. మూడు భాగాలుగా రాబోతున్న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

 

దీని కోసం 1500 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చిన రెండేళ్లకు దర్శక నిర్మాతలు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించ‌బోతున్నారు. అంతేకాదు.. సినిమా మొత్తం 3డిలోనే షూట్ చేయ‌బోతున్నారు.

 

రజనీకాంత్ 2.0 త‌ర్వాత 3డిలో షూట్ చేయ‌బోతున్న ఇండియ‌న్ సినిమా ఇదే. దంగ‌ల్ లాంటి సినిమా తెర‌కెక్కించిన నితీష్ తివారితో పాటు శ్రీ‌దేవి చివ‌రి చిత్రం మామ్ తెర‌కెక్కించిన ర‌వి ఉద్యావర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి మూడు భాగాలుగా రామాయ‌ణం సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. 2021లో తొలి భాగం విడుద‌ల కానుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే అక్టోబ‌ర్ నుంచి షూటింగ్ మొద‌లు కానుంది.

Leave a Reply