బామ్మ వయసు 96.. మార్కులు 98

Share Icons:

కేరళ, నవంబర్ 02,

విద్యనేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని మరో మారు ఈ 96 యేళ్ల బామ్మ నిరూపించింది. ఇటీవల కేరళ ప్రభుత్వం నిర్వహించిన అక్షరాస్యత పరీక్షలో పాల్గొన్న కాత్యాయణిఅమ్మ(96) 100 మార్కులకు 98 మార్కులు పొందారు. అలప్పుళ జిల్లాలోని చెప్పడ్ గ్రామానికి చెందిన  కాత్యాయణి ఇటీవలే ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ చేతుల మీదుగా, అక్షరాలంకారం దృవపత్రం కూడా అందుకున్నారు. వ్రాతపరీక్షలో 40కి 38, గణితం, చదవడంలో 30 కి 30 మార్కులు పొందినట్టు మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎస్. శ్రీకళ తెలిపారు. కాగా కేరళ వ్యాప్తంగా 2 వేల వార్డుల్లో ప్రస్తుతం అక్షరాస్యత కార్యక్రమం జరుగుతోందన్నారు. కాగా, 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో18.5 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, తాజా పరీక్షలో 43,330 మంది పరీక్షకు హాజరు కాగా, 42,933 మంది ఉత్తీర్ణులు కాగా,  పాలక్కాడ్ జిల్లాలో అధికంగా 10,866 మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు.

మామాట: విద్య ఉపాధికే కాదు.. అది వ్యక్తిత్వానికి సంబంధించింది.

Leave a Reply