9 ఏళ్ల బాలికపై పూజారి, ముగ్గురు సిబ్బంది అత్యాచారం… హత్య!

Share Icons:
  • విద్యుత్ షాక్ గా చిత్రీకరించే ప్రయత్నం
  •  పక్క గ్రామాల ఆందోళన
  • అత్యాచారం హత్య కేసు నమోదు
  • విచారిస్తున్న పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం. 9 ఏళ్ల ఓ బాలికపై 55 ఏళ్ల వయసున్న ఓ పూజారి,మరో ముగ్గురు సిబ్బంది కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆపై బాలికను హత్య చేసి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లుగా చిత్రీకరించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వారికి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డ మృతిపై అనుమానాలు వెంటాడటంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం… ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ దహనవాటిక ఉంది. దాని ఎదురుగా ఓ కుటుంబం అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆ దంపతులకు చెందిన 9 ఏళ్ల బాలిక ఆదివారం సాయంత్రం 5.30గంటలకు  అక్కడికి వెళ్లింది. అక్కడున్న ఫ్రిజ్‌ నుంచి చల్లని నీళ్లు తాగేందుకు ఆమె తర్వాత ఆ బాలిక చనిపోయినట్లు దహనవాటికలోని పూజారి ఆ చిన్నారి తల్లికి సమాచారమిచ్చాడు.. ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని ఆ పూజారి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది చెప్పారు. బాలిక శరీరంపై పలుచోట్ల కాలిన గాయాలను చూపించారు. అంతేకాదు, దీనిపై పోలీసులకు పిర్యాదు చేసే సమయం కూడా ఇవ్వకుండానే అదే దహనవాటికలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

పూజారి,ఆ సిబ్బంది చెప్పిన మాటలపై బాలిక తల్లికి మొదటి నుంచి అనుమానం వెంటాడుతూనే ఉంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధేశ్యామ్ అనే ఆ పూజారి, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన  తెలియగానే దాదాపు 200 గ్రామాలకు చెందిన స్థానికులు  సాయంత్రం రోడ్ల పైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. స్థానికుల నిరసన తర్వాత అత్యాచారం, హత్య కేసులు పెట్టారు.  దర్యాప్తు కొనసాగుతోంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply