9నెలల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడుకి ఉరిశిక్ష

9-month-old baby rapist gets death sentence
Share Icons:

హైదరాబాద్:

 

తెలంగాణలోని వరంగల్ కు చెందినప్రవీణ్ అనే కామాంధుడు 9 నెలల చిన్నారి శ్రీహితను అత్యాచారం చేసి చంపేసిన ఘటన అందరికీ గుర్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 18న తెల్లవారుజామున తల్లి పక్కనే నిద్రపోతున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఇంటికి సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయింది. చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రవీణ్ ఆమెపై లైంగికదాడికి దిగాడు.

 

ఈ సందర్భంగా నొప్పి భరించలేక చిన్నారి ఏడుస్తుండటంతో గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో తానే ఈ నేరం చేశానని నిందితుడు ప్రవీణ్ ఒప్పుకోవడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

 

అయితే ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. చిన్నారిపై హత్యాచారం చేసిన ప్రవీణ్ ను దోషిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. కేసును విచారించిన కోర్టు కేవలం 48 రోజుల్లోనే దోషికి మరణదండన విధించింది.

Leave a Reply