బ్యాంకులని బాగా ముంచారుగా….

70 thousand crore bank frauds
Share Icons:

ఢిల్లీ, 8 ఆగష్టు:

ఇటీవల కాలంలో రుణం పేరుతో బడాబాబులు బ్యాంకుల్లోని కోట్లాది రూపాయలను స్వాహా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బడా వ్యాపారవేత్తల మోసాల కారణంగా గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో భారతీయ బ్యాంకులు రూ. 70 వేల కోట్లను నష్టపోయాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రకాప్ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

నిన్న ఓ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు శుక్లా సమాధానం ఇస్తూ… 2015-16లో రూ. 16,409 కోట్లు, 2016-17లో రూ. 16,652 కోట్లు, 2017-18లో రూ. 36,694 కోట్లను బ్యాంకులు నష్టపోయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్టు తెలిపారు. ఇక బ్యాంకులను రూ. 1000 కోట్లకు పైగా ముంచిన వారు 139 మంది ఉన్నారని, వీరందరి బకాయిలూ ప్రస్తుతం నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో ఉన్నాయని వెల్లడించారు.

అలాగే 2007-08 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వాణిజ్య బ్యాంకుల్లో రూ. 25.03 లక్షల కోట్లుగా ఉన్న స్థూల అడ్వాన్సులు, 2014 నాటికి రూ. 68.75 లక్షల కోట్లకు పెరిగాయని ఈ సందర్భంగా చెప్పారు.

ఇది ఇలా ఉంటే ఖాతాదారుల సేవింగ్స్‌ అకౌంట్‌లో కనీస నగదు నిల్వలేవని కారణంతో బ్యాంకులు సుమారు రూ. 5వేల కోట్ల రూపాయాలని జరిమానాల రూపంలో విధించారు. అయితే పేద, మధ్యతరగతికి చెందిన అకౌంట్‌లే ఇందులో ఎక్కువగా ఉంటాయి.

మామాట: ఇలా అయితే ప్రజలకు బ్యాంకుల మీద నమ్మకం పోతుంది…..

Leave a Reply