69 ఏళ్ల ప్రియురాలి హత్య.. రంపంతో కోసి తల వేరుచేసి.. కాకినాడలో దారుణం

Share Icons:
కాకినాడలో కలకలం రేపిన కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. రంపంతో వృద్ధురాలి తల, మొండెం వేరుచేసి అతికిరాతకంగా హత్య చేసిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమెతో చేస్తున్న వృద్ధుడే ఆమెను దారుణంగా హతమార్చినట్లు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ నిజాలు వెల్లడించాడు.

నగరంలోని దుమ్ములపేట తారకరామానగర్‌కి చెందిన పేర్ల దుర్గ(69), పర్లోవపేట హనుమాన్ నగర్‌కి చెందిన పరస మంగయ్య అలియాస్ మంగరాజు సహజీవనం చేస్తున్నారు. పదిహేనేళ్లుగా ఇద్దరూ కలసి జీవిస్తున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయి. పర్లోవపేటలో ఉన్న రాజీవ్ గృహకల్ప భవన సముదాయంలో ఉన్న ఓ ఫ్లాట్ విషయమై నిత్యం గొడవ పడుతున్నారు.

Also Read:

తనకి తెలియకుండా ఫ్లాట్‌ని సుమారు రెండున్నర లక్షలకు అమ్మేశాడని తెలియడంతో దుర్గ ప్రియుడు మంగరాజుతో గొడవపడింది. నిత్యం వివాదాలు జరుగుతుండడంతో దుర్గని అడ్డుతొలగించుకోవాలని భావించిన మంగరాజు.. ఆమెని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు అర్ధరాత్రి చెక్క పనులు చేసే రంప తీసుకొచ్చి ఆమె మెడ కోసేశాడు. ఆమె తల, మొండెం వేరుచేసి అతికిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

Read Also: