అమ్మకాల్లో దూసుకుపోతున్న హోండా మోటార్..

Share Icons:

ముంబై, 21 డిసెంబర్:

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాల్లో అరుదైన రికార్డుని నెలకొల్పింది. గురువారానికి హోండా మోటార్స్ బైక్‌ల విక్రయాలు నాలుగు కోట్లకు చేరుకుంది. ఇక ఇందులో తొలి రెండు కోట్ల వినియోగదారులను చేరుకోవడానికి హోండాకు 14 ఏళ్లు పట్టగా.. మరో రెండు కోట్ల బైక్‌ల విక్రయానికి కేవలం నాలుగేళ్లు మాత్రమే పట్టింది. 

ఇక ఈ సందర్భంగా హోండా మోటార్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ…అత్యంత నాణ్యతతో కూడిన ఉత్పత్తులతో కోట్ల మంది వినియోగదారులకు చేరువైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తమ బైక్‌లు, స్కూటర్లు విస్తృతమైన శ్రేణిని కలిగి ఉన్నాయని, దీనికి తోడు తమ నెట్ వర్క్ శరవేగంగా విస్తరించిందన్నారు.

మామాట: బ్రాండ్ అలాంటిదిలే

Leave a Reply