30 కోట్లకు చేరిన జియో వినియోగదారులు

Share Icons:

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 15,

దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకోవడంలో రిలయన్స్‌ జియో తనకు తానే సాటిఅని నిరూపించుకుంది.  టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుని ఆ రంగంలో అతి పెద్ద  సంస్థగా జియో అవతరించింది.  కాగా, గత మార్చి2న  జియో ఈ మైలురాయిని సాధించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా జియో.. 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తున్నది. భారతీ ఎయిర్‌టెల్‌ 28.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ప్రకటించింది. అంటే టెలికం సేవలు ఆరంభించిన 19 వ సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది.

జియో కేవలం రెండున్నరేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్‌-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులున్నారు.

మామాట:  దూసుకుపోతోందిగా…

Leave a Reply