హుజూర్ నగర్ ఉపఎన్నికలో ట్విస్ట్..బరిలో సర్పంచులు

trs-congress-bjp-to-fight-for-prestige-in-telanganas-huzurnagar-bypolls
Share Icons:

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. ఒకవైపు ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంటే….సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అటు తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కోసం పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం అందరికీ తెలుసు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వారు ఎన్నిక ల బరిలో దిగారు. వీరి ఎఫెక్ట్ వల్ల కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలయ్యారు. సరిగా అదే పాలసీని హుజూర్ నగర్ ఉపఎన్నికలో ప్రయోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల పట్ల వివక్ష చూపుతోందంటూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్‌లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా సర్కారుకు తమ సత్తా చాటుతామని అంటున్నారు.

హలో సర్పంచ్‌.. చలో హుజూర్‌నగర్‌ పేరుతో ఈ నెల 29, 30 తేదీల్లో తాము నామినేషన్లు దాఖలు చేయనున్నుట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదామి భూమన్నయాదవ్‌ తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్లు వేయడమే కాకుండా.. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు.

అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ట్రాక్టర్ గుర్తు కారణంగానే కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంత మంది పోటీలో ఉంటే ఎవరికి నష్టమనే అంచనాలు మొదలయ్యాయి. ఒకసారి గత హుజూర్ నగర్ ఎన్నికల సరళిని ఒక్కసారి పరిశీలిస్తే.. 2009లో తొలిసారి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత విద్యుత్‌ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. మళ్ళీ 2014 లో కాంగ్రెస్ తరుపున బరిలో దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి…టీఆర్ఎస్ అభ్యర్ధి శంకరమ్మపై విజయం సాధించారు. అలాగే 2018 ఎన్నికల్లో మరోసారి ఉత్తమ్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఓడిపోయారు.

అయితే మొన్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగా గెలిచారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో ఉండగా,..టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డి బరిలో ఉన్నారు. మరి ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

Leave a Reply