ఆరు నెలలకి ముందే సీట్ల లెక్క తేల్చుకున్న బీజేపీ, జేడీయూ…

2019-lok-sabha-polls-bjp-jdu-agree-to-contest-equal-number-of-seats-in-bihar
Share Icons:

పాట్నా, 26 అక్టోబర్:

మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీ పార్టీ తమ మిత్రపక్షాలతో సీట్ల లెక్కలు తెచ్చుకుంటుంది. మొన్నటివరకు సీట్ల విషయంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసుకున్న బీజేపీ, నితిశ్ కుమార్ నేతృత్వంలోనే జేడీయూ పార్టీలు ఎన్నికలకీ ఆరు నెలల ముందే డీల్ కుదుర్చుకున్నాయి.

బీహార్‌లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉండగా…ఇందులో బీజేపీ, జేడీయూ చెరి 16 సీట్లలో పోటీ చేస్తారు. ఇక మిగతా వాటిల్లో ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన లోక్‌జనశక్తికి 5 స్థానాలు, కుష్వాహ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు.

కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ ఎన్డీయే పక్షాలు 31 స్థానాలు గెలుచుకున్నాయి.

మామాట: మరి ఈసారి ఎన్డీయే ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో…

Leave a Reply