Views:
3

నాగపట్నం జిల్లా పొరయార్ లో ఘటన

తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది.  నాగపట్నం జిల్లాలో పొరయార్ లో బస్ డిపో గ్యారేజ్ పైకప్పు కూలింది.  ఈ ఘటనలో 9 మంది మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నాగపట్నం ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై అధికారులు ఆరా తీశారు.  గ్యారేజ్ సిబ్బంది విధుల అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

చనిపోయిన వారిలో నలుగురు మెకానిక్ లు, ముగ్గురు డ్రైవర్లు,  కండక్టర్ ఉన్నారు.  పురాతనమైన భవరం కావడంతో శిధిలావస్థలో ఉందని, ఎప్పుడైనా కూలొచ్చని  తెలిపినా అధికారులు పట్టించుకోలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50 లక్షల పరిహారం చెల్లించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *