Views:
2

శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు చమర కపుగెదరకు పెను ప్రమాదం తృ టిలో తప్పింది. అబుదాబిలో పాక్ తో జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది.   తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 208 పరుగులకు ఆలౌట్ అయింది.  తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ పదో ఓవర్ ముగిశాక వికెట్ కీపర్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా బంతిని అందుకుని దూరంగా వెళ్తున్న కపుగెదరవైపు విసిరాడు. ఆయన  గమనించకపోవడంతో బంతి వేగంగా వచ్చి అతడి ముఖాన్ని బలంగా తాకింది. అయితే, కంటికి కొద్దిగా కింద తగలడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే కన్ను పోయి ఉండేది. బంతి తగిలిన చోట  పెద్ద బొడిపె ఏర్పడింది. దీంతో వెంటనే అతడిని వైద్యం కోసం తరలించారు. కపుగెదర పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని టీం మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ  మైదానంలో గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ బౌచర్ కూడా ఇలాగే గాయపడ్డాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *