Views:
1

ఇండియన్ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను  న్యాయశాఖకు అందజేశారు. కుటుంబ కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.  తనకు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేకపోతున్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  ఇప్పటికైనా తన కుటుంబ సభ్యులతో గడపాలనే ఆలోచనతోనే రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు.  సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన వాదించారు.  ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుపై సంతృప్తికరంగా ఉందన్నారు.  సొలిసిటర్ జనరల్‌గా నియామకానికి ముందు ఆయన గుజరాత్ ప్రభుత్వ న్యాయవాదిగా రంజిత్ కుమార్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *