Views:
1

 

నోకియా 7ను చైనాలో లాంచ్ చేశారు.  ఇది త్వరలో ఇండియాకు రానుంది.  HMD గ్లోబల్. నోకియా 8లో తొలిసారి వాడిన డ్యుయల్ సైట్ మోడ్ ఫీచర్‌ను ఇందులోనూ ఇచ్చారు. అంటే యూజర్లు ఒకేసారి రియర్, ఫ్రంట్ కెమెరాలను వాడుకోవచ్చు. అంతేకాదు బిల్టిన్ కెమెరా నుంచే యూజర్లు ఫేస్‌బుక్, యూట్యూబ్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఇచ్చుకోవచ్చు. కెమెరా యాప్ నుంచే నేరుగా డ్యుయల్ సైట్ మోడ్‌తో ఫేస్‌బుక్ లైవ్‌లోకి వెళ్లే ఆప్షన్ ఉన్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. ప్రస్తుతానికి నోకియా 7 చైనాలోనే అందుబాటులో ఉంది. వచ్చే మంగళవారం నుంచి ఈ మోడల్ మార్కెట్‌లోకి రానుంది. మిగతా దేశాల్లోకి ఎప్పుడు అడుగుపెడుతుందన్నది మాత్రం ఇంకా చెప్పలేదు.

4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి. 4 జీబీ వేరియంట్ మన కరెన్సీలో సుమారు రూ.25 వేలు కాగా.. 6 జీబీ వేరియంట్ రూ.26500గా ఉంది. 360 డిగ్రీ రికార్డింగ్‌ను సపోర్ట్ చేసే నోకియా ఓజో ఆడియా టెక్నాలజీ నోకియా 7లో ఉంది.

నోకియా 7  ప్రత్యేకతలు:

.. ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ వర్షన్‌

.. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

.. ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్‌కు నోకియా 7 సిద్ధం

.. మోడల్ 5.2 ఇంచ్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే

.. స్క్రీన్ రిజల్యూషన్ 1080×1920 పిక్సెల్స్

.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3

.. ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌

.. 64 జీబీ స్టోరేజ్.. 128 జీబీ వరకు ఎక్స్‌ప్యాండ్

.. రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్

.. సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్‌

.. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ

.. 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *