Views:
3

అమెరికాలో ఘోరం జరిగింది. కన్నపిల్లల్ని ఓవెన్ లో పెట్టి కాల్చేసింది ఓ కర్కశ తల్లి. చంపడమే కాదు.. ఆ తతంగాన్ని వీడియో తీసి తన భర్తకు పంపింది. ఈ క్రూరమైన ఘటన అట్లాంటలోని ఓక్లాండ్ సిటీలోని వెస్ట్ ఎండ్ అపార్ట్ మెంట్ లో జరిగింది. 17వ తేదీ అర్థరాత్రి 12 గంటల సమయంలో భర్తతో వీడియో చాటింగ్ చేస్తూనే ఈ ఘోరానికి పాల్పడింది కన్న తల్లి. పూర్తి వివరాల్లోకి వెళితే..

అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ (24) మరో సిటీలో ఉన్న భర్తతో వీడియో ఛాట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ మహిళ.. తన రెండేళ్ల కుమారుడు యుంటే పెన్, ఏడాది చిన్నారి కార్టర్ విలియమ్స్‌లను ఒవెన్‌లో కూర్చోపెట్టింది. తన పిల్లలను ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించిన తండ్రి జమీల్‌ పెన్‌.. వెంటనే అట్లాంట పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చే లోపే పిల్లలు మాంసం ముద్దలుగా మారిపోయారు.

ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు చెబుతున్నారు పోలీసులు. గతంలోనూ చేతిని కోసుకోవటం వంటి పనులు చేసేదని అంటున్నారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న తల్లి దగ్గర పిల్లలను ఒంటరిగా భర్త ఎలా వదిలిపెట్టాడు అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం.. ఆమెపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *