Views:
2

చెన్నైలో ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 90 వ వార్షికోత్సవ మహాహసభలు ఘనంగా జరిగాయి.   ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడుడు హాజరయ్యారు.  మన దేశంలో పెట్టుబుడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా “ ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్”  అని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.  దేశాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో ప్రతిభను చాటిన వారికి అవార్డులను అందజేశారు.  ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తరఫున లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. ప్రపంచానికి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి సేవలు అజరామరంగా నిలిచిపోయాయని కీర్తించారు.  పారిశ్రామిక వేత్త వనితా చాట్లను సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *