Views:
4

అమెరికా వెళ్లిన ఏపీ సీెఎం చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.  గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్ నెట్‌వర్క్ (జీ-టెన్) సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఐటీ  సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాబ్ ఉంది కదా అని సరిపెట్టుకోకుండా, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు పుట్టిన గడ్డకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని, మరింతమందికి ఉద్యోగాలిచ్చి సంపద సృష్టించాలని చంద్రబాబు కోరారు. అలాగే మిమ్మల్నివచ్చే 12 నెలల్లో నవ్యాంధ్రలో 500 కంపెనీలు  ప్రానంభించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లుె తెలిపారు.   విజయవాడలో ఐటీ సంస్థల ఏర్పాటుకు 60 ఎన్నారై కంపెనీల ప్రతినిధులు ముందుకు వచ్చారు.  షికాగోలోని ఐటీ నిపుణులతోమాట్లాడే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే తాను హైదరాబాద్‌లో ఉన్నానా, లేక విజయవాడలో ఉన్నానా? అన్న సందేహం కలుగుతోందన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను తీసుకున్న నిర్ణయాల వల్లే లలఇప్పుడు ఎకానమీలో మంచి ఫలితాలిస్తున్నాయన్నారు.  ఏపీలో ఆక్వా పరిశ్రమపై ప్రత్యేకంగా  దృష్టి సారించామని, ఇక అమెరికాలో ఎక్కడ చూసినా ఏపీ నుంచి వచ్చిన చేపలు లభిస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *