Views:
7

 

రేవంత్ కాంగ్రెస్ లో చేరే అవకాశం

రేవంత్ తో పాటు మరికొంతమంది  కూడా టీడీపీని వీడే అవకాశం

తెలంగాణలో టీడపీకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.  కీలక నేతగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని వీడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.  ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని  వార్తలు రావడంతో  ఆ పార్టీ నేతలు  తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం  చేసేందుకు పార్టీ అగ్ర శ్రేణులు  పావులు కదుపుతున్నారు.  తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం  యూపీఏ హయాంలో ఏర్పడినప్పటికినీ.. తెలంగాణలో అధికారం రాని విషయం తెలిసిందే.  కనీసం 2019 ఎన్నికల్లో అయినా అధికారంలోకి  వచ్చేందుకు ఆ పార్టీ అడుగులు వేస్తోంది.  దీనికోసమే పార్టీలో కీలక మార్పులు చేయాలని పార్టీ భావిస్తోంది.

ఇప్పటివరకు టీటీడీపీలో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకొనే విషయాన్ని అధిష్ఠానం సీనియర్ నేతలతో  చర్చించారు.  అందరిని సమన్వయం చేస్తూ రేవంత్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయిచినట్టు సమాచారం.   ఆయనతో పాటు మరికొంత మంది కూడా కాంగ్రెస్ తీర్ధం స్వీకరించే అవకాశం ఉంది.   పార్టీ మారే విషయంపై స్పందించిన రేవంత్ తాను పార్టీ మారడం లేదని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *