Views:
4

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పై  షబ్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  యువరాజ్ సోదరుడు జరోవర్ సింగ్  భార్య గృహ హింస కేసు పెట్టింది.  భర్త జరోవర్ తో పాటు యువరాజ్  సింగ్ అత్త షబ్నం సింగ్‌పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బాధితురాలు ఆకాంక్ష తరపు న్యాయవాది స్వాతి సింగ్‌ మాలిక్‌ తెలిపారు. కొంతకాలంగా ఆకాంక్ష జరోవర్ కు దూరంగా నివసిస్తోంది.  వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్న దానిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది.

 

యువరాజ్ సింగ్ పై  గృహ హింస కేసును ఎలా  నమోదు  చేస్తారని న్యాయవాది స్వాతిని విలేకరులను ప్రశ్నించగా శారీరకంగా హింసిస్తే ఈ కేసు నమోదు చేయరని, బాధితురాలిని మానసికంగా, ఆర్దికంగా వేధించినా  ఈ కేసును నమోదు చేయవచ్చని తెలిపారు.  బిడ్డను కనాలని జరోవర్‌, షబ్నంతో పాటు యూవీ కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చి వేధిస్తున్నారని తన క్లయింట్ ఆకాంఓపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే యేవరాజ్ పై కేసు నమోదు చేశామన్నారు.   ఈ విషయంలో యువీ తన కుటుంబసభ్యులకు మద్దతు పలుకుతున్నాడని స్వాతి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *