Views:
3

బాణాసంచా దుకాణంలో ట్రంప్

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటో

దీపావ‌ళి సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. బాణాసంచా కొన‌డానికి ఉస్మాన్ గంజ్‌లో ఓ బాణాసంచా దుకాణానికి కూడా వెళ్లాడు. ఇదంతా ఎప్పుడు, ఎక్క‌డ‌ జ‌రిగింది అనుకుంటున్నారా?… ఇవాళే (బుధవారం) … సోష‌ల్ మీడియాలో జ‌రిగింది. అచ్చం డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా ఉన్న వ్య‌క్తి బాణాసంచా దుకాణంలో ఉన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. ఈ ఫొటో మీద నెటిజ‌న్లు త‌మ హాస్య‌చ‌తుర‌త‌ను కురిపిస్తున్నారు. `ఉత్త‌ర కొరియా మీద వేయ‌డానికి రాకెట్ కొన‌డానికి ట్రంప్ ఇండియా వ‌చ్చాడు`, `రాకెట్ త‌యారు చేసే విధానం నేర్చుకోవ‌డానికి వ‌చ్చాడు` అంటూ జోకులు పేలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *