Views:
2

 

ఏపీ డీజీపీ సాంబశివరావుకు పదవీ కాలం పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలుస్తోంది.  ఈ ఏడాది డిసెంబర్ లో ఆయన పదవీ కాలం ముగియనుండటంతో మరో రెండేళ్ల పాటు ఆయన సర్వీసును వాడుకోవాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.   ఈ విషయంలో పలువురు ప్రభుత్వ పెద్దలను సంప్రదించగా వారు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారని .. సీఎం చంద్రబాబు  విదేశీ పర్యటనకు వెళ్లేముందు  పెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలను అధికారులలో చర్చించారు.   ఈ సమావేశంలో డీజీపీ విషయం కూడా చర్చకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అయితే డీజీపీ పదవి కోసం చాలామంది సీనియర్ అధికారులు పోటీపడుతున్నారు. సాంబశివరావు పనితీరు, నడవడిక, ఇప్పటి వరకు పనిచేసిన క్రమంతో పాటు సామాజాక కోణాన్ని పరిగణనలోకి తీసుకొని  ఆయన్నే మరికొంత కాలం డీజీపీ గా కొనసాగేలా సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  డీజీపీ పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్రహోంశాఖ, యూపీపీఎస్సీలకు ఫైల్ ను పంపించాలని సీఎం  ఆదేశించారని చర్చ కొనసాగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *