Views:
2

 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా భారత్‌కు ఇప్పట్లో దక్కేలా లేదు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరుపున రాయబారి నిక్కీ హేలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. వీటో అధికారం ఎవరికీ రానివ్వకూడదనే శాశ్వత సభ్యత్వ దేశాల వైఖరే భారత్‌కు శాశ్వత హోదా దక్కకపోవడానికి కీలక అంశంగా మారిందన్నారు హేలీ. వాషింగ్టన్‌లో నిర్వహించిన భారత్‌ అమెరికా ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడిన ఆమె ఈ విషయాన్ని తెలిపారు.

భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలలో వీటో అధికారం ప్రధానంగా మారింది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వ దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్‌ అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల్లో.. ఏ దేశం కూడా వీటో విషయంలో వేరే దేశం జోక్యాన్ని సహించలేకపోతున్నాయని హేలీ తెలిపారు. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. భారత్‌ శాశ్వత హోదాకు ఇప్పుడు వీటో అంశమే కీలకంగా మారిందన్నారు. ఇండియాకు శాశ్వత హోదా కల్పించే విషయంలో తాము అనుకూలంగానే ఉన్నప్పటికీ అమెరికా కాంగ్రెస్‌కు గానీ, సెనేట్‌కుగానీ భద్రతా మండలిని సంస్కరించే పూర్తి అధికారాలు లేవన్నారు. ఇది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన విషయం. ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతామండలిలోని సంస్కరణ అంశం. ఇందులో మార్పు తీసుకురావాలని భారత్‌ బలంగా కోరుకుంటే మరిన్ని దేశాల మద్దతిస్తేనే  అది సాధ్యం అవుతుందని అనుకున్నట్లు తెలిపారు హేలీ. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే వీటోను విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *