Views:
1

పచ్చ కండువా కప్పుకున్న బుట్టా రేణుక

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేరుతుందనే ఊహాగానాలకు తెరపడింది.  వైసీపీ అధ్యక్షుడు జగన్ కు కర్నూలు ఎంపీ బుట్టా  రేణుక గట్టి షాకిచ్చింది. కొద్దిసేపటి క్రితం అమరావతి, ఉండవల్లిలోని సీం చంద్రబాబునాయడు ఆమెకు పచ్చ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. రేణుక, తన భర్త, తన అనుచరులతో కలసి సీఎం నివాసానికి చేరుకొని తెలుగుదేశం తీర్దం స్వీకరించారు.  ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి తాను కట్టుబడి వున్నానని తెలిపారు. బుట్టా రేణుకతో పాటు వైసీపీ నేత, సెంట్రల్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి ప్రకాశ్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు.  రేణుక భర్త బుట్టా నీలకంఠ గతంలోనే టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి పార్టీ మనోబలాన్ని దెబ్బతీసేందుకే మలివిడత ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *