Views:
3

 

భాగ్యనగరం సమీపంలో ఒకే చోట మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు.  సిటీకి సమీపంలో.. సంగారెడ్డి రామచంద్రాపురం కొల్లూరు గ్రామ శివార్లలో మూడు మహిళా మృతదేహాలు పడి ఉండటం సంచలనం గా మారింది. అక్టోబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం గ్రామస్తుల చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమచారం అందించారు. ఓ యువతి వయస్సు 20 ఏళ్లు, మరో యువతి వయస్సు 28 సంవత్సరాలు.. మరో మహిళ వయస్సు 45 ఏళ్లుగా ఉంటుంది. వీరు ఎవరు.. ఎక్కడి వారు అనేది ఇంకా తెలియరాలేదు. వీరు కొల్లూరు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎక్కడైనా చంపేసి మృతదేహాలను ఈ ప్రాంతంలో పడేశారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు మహిళల వివరాలు తెలిస్తేనే ఈ కేసు మిస్టరీ వీడేది. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారా లేదా అనేది కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో నార్సింగ్ పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *