Views:
2

 

 

శ్రీశైలం నుంచి నాలుగు గేట్ల ద్వారా..

శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 2,76,188 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను  884అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.032 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా 27501 క్యూసెక్కుల నీటితో 103 మెగావాట్ల సామర్థ్యం, ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటితో 150 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్‌కు 2,21,572 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే పోతిరెడ్డిపాడుకు 11వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 1013 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకు 1600క్యూసెక్కులు మొత్తం కలిపి 1,66,340 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొసాగుతున్నది.
నాగార్జునసాగర్‌కు జలకళ

నాగార్జున సాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. 552 అడుగులతో 215.540 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి రావడంతో వచ్చే వరదను ఎప్పటికప్పుడు రేడియల్ క్రస్ట్ గేట్లు నుంచి, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,07,959 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1650 క్యూసెక్యుల నీరు విడుదలవుతోంది. మూసీ ప్రాజెక్టుకు రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. రెండు గేట్ల ద్వారా 2293 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు

ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.31 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 1079.90 అడుగులు 52.010 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాల్వలు, లిఫ్ట్‌లకు 9,285 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు.

నిజాంసాగర్‌లో పెరుగుతున్న నీటి మట్టం

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22,612 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 క్యూసెక్కులు) కాగా, ప్రస్తుతం 1397.82 అడుగులు (9,156 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 1683 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 696.250అడుగులు (6.659టీఎంసీల) వద్ద ఉంది. కుడి కాలువ ద్వారా 17 క్యూసెక్కులను వదులుతున్నారు.

ఎల్లంపల్లి గేట్ల మూసివేత

ఎల్లంపల్లి జలాశయానికి వరద తగ్గటంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం 586 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 19.508 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *