Views:
2

ఉల్లి మళ్లీ భయపెడుతోంది. మొన్నటి వరకు రూ.10లు ఉన్న ధర.. ఇప్పుడు ఒక్కసారిగా రూ.40కి చేరకుంది. మలక్‌పేట్‌ మార్కెట్‌లో హోల్‌సేల్‌గా నాణ్యమైన ఉల్లి కిలో రూ.25 పలుకుతుండగా…. బహిరంగ మార్కెట్ లో రూ.35 నుంచి రూ.40గా ఉంది. మరోవైపు టమాటా కూడా పెరిగిపోతోంది. రైతు బజార్లో కిలో ధర రూ.50గా ఉంది. కృత్రిమ రేట్లతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు.

ఉల్లిరేట్లు పెరగటానికి మహారాష్ట్ర మార్కెట్లే కారణంగా చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచే రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అయితే దేశంలోనే అతి పెద్ద మార్కెట్‌ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో 10 రోజుల్లోనే 80 శాతం మేర ఉల్లి ధరలు పెరిగినట్లు తెలిసిందని, ఆ కారణంగానే తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది ఉల్లికి గిట్టుబాటు కాక ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్‌ పెరిగిందని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని మార్కెట్లు వారం రోజులు మూసేస్తారని, ఆ ప్రభావమూ ధరల పెరుగుదలపై ఉంటుందని చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *