Views:
3

 

ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారులపై మరోసారి విరుచుకుపడ్డారు.  ఎక్కువ మంది అధికారులు పనిచేయట్లేదని… ఢిల్లీ అభివృద్ధికి సచివాలయమే ఆటంకంగా మారిందన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్సించడంలేదని కేంద్రంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర స్థాయి హోదా వచ్చిన 24 గంటల్లోనే కాంట్రాక్ట్ ద్యోగులనందరిని క్రమబద్దీకరిస్తామన్నారు.  కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ గురించి తాను ప్రతిపాదించినప్పుడు అధికారులంతా తనతో విభేదించారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే వారు పనిచేయరని తనతో చెప్పారన్నారు. ఇదే సూత్రం ఐఏఎస్‌ అధికారులకూ వర్తిస్తుందని, వారంతా పనిచేయడం లేదని అందుకే వారి నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికనే ఉండాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *