Views:
1

నిందితుని ఊహా చిత్రం విడుదల చేసిన సిట్ అధికారులు

సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిలో భాగంతా క అనుమానితుని ఊహా చిత్రం విడుదల చేశారు.  అయితే  ఈ చిత్రం తుమకూరు గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యుడు సురేష్‌ గౌడ (భాజపా) వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌ను పోలి ఉంది.  పోలీసులు  ఈ చిత్రాన్ని విడుదల చేపిన దగ్గరి నుంచి ప్రభాకర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరీ లంకేశ్‌ను హత్య చేసిన వారికి- నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఈ విషయాన్ని అడిగేందుకు నాకు ఫోన్‌ చేయవద్దు’అని తన ముఖపుస్తకంలో ఆయన పోస్ట్‌ చేశారు. తనను కలుసుకున్న విలేకరులకు కూడా ఇదే విషయాన్ని స్పష్టీకరించారు. ‘నేను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తను. 18 సంవత్సరాలుగా నుదుట తిలకం పెట్టుకుంటున్నా. తలకట్టు, మీసం, నుదుట తిలకం ఉన్న వ్యక్తి చిత్రం మీ చిత్రంతో పోలి ఉందని మొదటిగా నాకు ఒక పాత్రికేయ మిత్రుడు ఫోన్‌ చేసి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *