Views:
7

అల్లుఅర్జున్ , అను ఇమ్మానియేల్ జంట గా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. వక్కతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి , శిరీష్ శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్న సీనియర్ నటుడు ” అర్జున్ ” ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది.ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో అల్లుఅర్జున్,అర్జున్ ల మధ్య చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.అర్జున్ ఈ చిత్రంతో ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంకా ఈ చిత్రంలో శరత్ కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో చేస్తున్నట్లు తెలుస్తుంది.

‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ లో అల్లుఅర్జున్ మరొక కొత్త తరహాలో కనిపించనున్నారు. సూర్యగా ఆయన పాత్ర, గెటప్‌, పలికే సంభాషణలు ఇవన్నీ కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. తన పాత్ర కోసం దేహ దారుఢ్యం పెంచుకోవడానికి బన్నీ ప్రత్యేకంగా కసరత్తులు చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత ద్వయం విశాల్‌ – శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే యేడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *