Views:
5

 

 

జగన్ పార్టీలోకి రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి వెళ్ళనున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ శనివారం విశాఖలోని ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారే విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు. తమ పార్టీవీడి ఎటూ వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలోనూ, అక్కడా, ఇక్కడా చక్కర్లు కొట్టడం మామూలేనని అవన్నీ పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. విశాఖలో తన పుట్టినరోజు నాడు జరిగే కొన్ని కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. అదే రోజు సినీనటి జమునను సత్కరిస్తున్నట్టు కూడా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *