Views:
8

శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో ఇక తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కే అవకాశాలు కనిపంచడం లేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గ  విస్తరణలో మొత్తం 9 మందికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో సీనియర్ మాజీ అధికారులకు అవకాశం కల్పించడంపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది. కేబినెట్‌లో కొత్తగా చోటు దక్కించుకున్న వారిలో యూపీకి చెందిన శివ ప్రతాప్ శుక్లా, బిహార్ నుంచి అశ్వినికుమార్ చౌబే,  కర్ణాటక నుంచి అనంతకుమార్ హెగ్డే, రాజస్థాన్ నుంచి గజేంద్రసింగ్ షేఖావత్, మధ్యప్రదేశ్ నుంచి వీరేంద్ర కుమార్, మాజీ ఐఏఎస్ రాజ్ కుమార్ సింగ్, హర్దిప్ సింగ్ పూరి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ , కేరళకు చెందిన అల్ఫాన్స్ ఉన్నారు. చోటు దక్కించుకున్న వారిలో ఎవరికి ఏయే శాఖలు కేటాయిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. మంత్రివర్గంలో ఇద్దరి తెలుగు వాళ్ల పేర్లు వినిపించినప్పటికి కేంద్రమంత్రులుగా వారు కనిపిస్తారో  లేదో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ హరిబాబు శనివారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తోంది.  కుటుంబసభ్యులతో కలిసి ఆయన విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆయనకు చోటు దక్కనుందనే కారణంగానే ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి బయలుదేరినట్టు సమాచారం. ఇక కేంద్ర కేబినెట్ లోకి చేరబోతున్న రెండవ వ్యక్తిగా అనుకుంటున్న వెదిరె శ్రీరామ్ గారి గురించి ఎక్కడా ఎలాంటి వార్త వినిపించకపోవడం కాస్తంత నిరాసగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *