Views:
3

నేటి విద్యావ్యవప్తలోని లేపాలు లొసుగుల వల్ల  రానున్న విద్యా సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మొత్తం 800 ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడబోతున్నాయి.  ఈ విషయాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ మీడియా ముందు వెల్లడించారు. ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగకపోవడంతో ప్రతి ఏడాది 150 కాలేజీలు స్వచ్ఛందంగా మూత పడుతున్నాయనీ, మౌలిక వసతులను కల్పించడంలో కాలేజీ యాజమాన్యాలు విఫలం అవుతున్నాయనీ అనిల్ దత్తాత్రేయ అన్నారు.

 

గతకొన్నాళ్లుగా 30 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరిగాయని ఈ క్రమంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులు విచిత్రంగా మారుతున్నాయని ఆయన అన్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ అంటే 2017-18 సంవత్సరం తరువాత 410 కళాశాలలను మూసివేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ తన వెబ్ సైట్లో ప్రకటించింది. మూత పడనున్న కళాశాలల్లో ఎక్కువశాతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉండండం గమనార్హం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *