Views:
5

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. మోడీబాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఈసారి మొత్తానికి 12 మంది కొత్త వారిని  మంత్రివర్గంలో చేర్చనున్నారు. ఇప్పుడిక కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం, కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. 2019 లే జరగబోయే ఎన్నకలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడీ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సమాచారం.  శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్, గుజరాత్ రాష్ర్టాల అభ్యర్ధులకు మంత్రి వర్గంలో పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. కొందరికి ఇప్పటికే ఉన్న భాద్యతలతో పాటు అదనపు భాద్యతుల కూడా కేటాయించనున్నారు.

 

ఇటీవల జరుగుతన్న వరుస రైలు ప్రమాదాల గురించి స్పందిస్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభూ రాజీనామా చేస్తానన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపద్యంలో మోడీ చేసిన వాఖ్యలను బట్టి రైల్వే మంత్రిని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక తెలుగు వాళ్లలో కేంద్ర కార్మికశాఖ మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడం మంత్రివర్గ విస్తరణకు వీలుగా మారింది. 2019 ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని విస్తరణ చేపట్టిన నేపధ్యంలో తెలంగాణా నుంచి కొత్తవారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడిగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ పేరును కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఇచ్చి కొలువులో చేర్చిన విషయం తెలిసందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *