Views:
8

మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించి  హైదరాబాద్‌ బేగంపేటలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖ  అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో   సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి  హాజరై ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్‌ పలు అంశాలను పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా చేపట్టిన టీ–ఫైబర్‌ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామని అన్నారు.  వాటర్ పైప్ లైన్లు వేసేటప్పుడే ఆప్టిక్ ఫైబర్ లైన్ కూడా వేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రతి పైప్ లైన్ తో పాటుగా ఇంటర్నెట్ లైన్ కూడా వేయాలని అందుకు తగిన ఏర్పాట్లన్నీ అధికారులు సిద్ధం చేసుకోవాలని  సూచించారు.

 

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా చేపట్టిన టీ–ఫైబర్‌ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామనీ తద్వారా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులొస్తాయనీ ఆయన అన్నారు.  అర్బన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతో పాటు టీ–ఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయం చేసుకునేందుకు ఐటీ, మున్సిపల్‌ శాఖలు కలసి పనిచేయాలన్నారు. ఇందుకోసం జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అర్బన్‌ భగీరథ కోసం మంత్రి నిర్వహించిన సమీక్షలో అధికారులంతా పాల్గొని, నిర్మాణాలు, ప్రణాళికలకు సంభందించిన రూపకల్పన, ఇంకా నిధులకు సంబంధించిన వివరాలను మంత్రికి అందజేసారుప్రాజెక్టు కోసం టెండర్లు పూర్తయిన టెండర్ల వివరాలనూ, ఇప్పటికే పలుచోట్ల ప్రారంభమైన పనులను గురించి మంత్రికి తెలియజేసారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *