Views:
4

తెలంగాణ: ఈ నెల రెండో వారంలో గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో భాగంగా పీజీటీ, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వెరిఫికేషన్ పక్రియలో ఆధార్‌ తప్పనిసరిగా అందజేయాలని వెల్లడించింది. వెరిఫికేషన్‌ నిర్వహించే సమయానికి అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను ముందుగానే సిద్దం చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్మర్ధుల వివరాలను కూడా త్వరలో  ప్రకటిస్తామని బోర్టు తెలిపింది.

 

విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పదవ తరగతి, స్కూల్‌ స్టడీ సర్టిఫికెట్లు, నాన్‌ క్రీమీలేయర్,  దివ్యాంగులైతే అందుకు సంభందింయిన సర్టిఫికేట్ లూ సిద్దం చేసుకోవాలని తెలిపింది.  వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్ధులందరూ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని  బోర్డు సూచించింది. అలాగే పోస్టులు, జోన్లుకు సంబంధించి తమ ప్రాధాన్యతలను వెబ్ లోనే తెలియజేయాలని పేర్కొంది.  మెయిన్ పరాక్షలకు సంబందించిన కీ వివరాలను సెప్టెంబరు 2 నుంచి టీఎస్పీయస్సీ అందుబాటులో ఉంచనుంది. కీ కు సంబంధించిన ఫిర్యాదులు పీడీఎఫ్ ల రూపంలో మాత్రమే పంపాలని కోరింది. ఇతర వివిరాలు ఏవైనా టీఎస్పీయస్సీ వెబ్ సైట్ నుంచి పొందవచ్చని సూచించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *